మహేష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అదెప్పుడు అని అనుకోవద్దు ఎందుకంటే..ఇదంతా `భరత్ అనే నేను` సినిమాలో భాగంగానే. ఇందులో మహేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణ స్వీకార సందర్భంగా చెప్పే మాటల ఆడియో విడుదలైంది.
``భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్నిసమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం, పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను....`` అంటూ మహేష్ చేసిన ప్రమాణంతో ఆయన క్యారెక్టర్, సినిమా పేరు కన్ఫర్మ్ అయ్యాయి. భరత్ అను నేను సినిమా తొలి ప్రమాణ స్వీకారంగా విడుదలైంది. దీంతో ఈ సినిమాకు టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్ అదే శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో `భరత్ అనే నేను` సినిమా రూపొందుతుంది. ఏప్రిల్ 27న విడుదలవుతుంది. కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com