మహేష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం విడుదల

  • IndiaGlitz, [Friday,January 26 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశాడు. అదెప్పుడు అని అనుకోవ‌ద్దు ఎందుకంటే..ఇదంతా 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలో భాగంగానే. ఇందులో మ‌హేష్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కనిపిస్తారు. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రిగా మ‌హేష్ ప్ర‌మాణ స్వీకార సంద‌ర్భంగా చెప్పే మాట‌ల ఆడియో విడుద‌లైంది.

''భ‌ర‌త్ అనే నేను శాస‌నం ద్వారా నిర్మిత‌మైన భార‌త రాజ్యాంగం ప‌ట్ల నిజ‌మైన విశ్వాసం, విధేయ‌త‌ను చూపుతాన‌ని, భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారాన్నిస‌మ‌గ్ర‌త‌ను కాపాడుతాన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నా క‌ర్త‌వ్యాల‌ను శ్ర‌ద్ధ‌తో అంతఃక‌ర‌ణ శుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని, భ‌యం, ప‌క్ష‌పాతం, రాగ‌ద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాస‌నాల‌ను అనుస‌రించి ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం చేకూరుస్తాన‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను....'' అంటూ మ‌హేష్ చేసిన ప్ర‌మాణంతో ఆయ‌న క్యారెక్ట‌ర్‌, సినిమా పేరు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాయి. భ‌ర‌త్ అను నేను సినిమా తొలి ప్ర‌మాణ స్వీకారంగా విడుద‌లైంది. దీంతో ఈ సినిమాకు టైటిల్ విష‌యంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్ర‌యూనిట్ అదే శ్రీమంతుడు చిత్రం తర్వాత మ‌హేష్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో 'భ‌ర‌త్ అనే నేను' సినిమా రూపొందుతుంది. ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది. కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

పాత‌బ‌స్తీ నేప‌థ్యంతో..

పోలీస్ పాత్రలకి, మాస్ మహారాజా రవితేజకి విడదీయరాని బంధం ఉంది. పోలీస్ కథలతో గతంలో ర‌వితేజ హీరోగా వచ్చిన 'వెంకీ', 'విక్రమార్కుడు', 'మిరపకాయ్', 'పవర్' వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి.

వారిని టార్గెట్ చేసుకున్న తరుణ్

కుటుంబ సమేతంగా చూడ దగ్గ ప్రేమ కథా చిత్రాల్లో నటించి..

రాజశేఖర్.. మూడు కొత్త ప్రొజెక్ట్స్‌

దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత విజయాన్ని చవిచూసారు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు డా.రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'పి.ఎస్‌.వి గరుడవేగ 126.18 ఎమ్‌' చిత్రంతో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సీనియర్ హీరో.

దుబాయ్ పయనమౌతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సాహో'.

'యు-టర్న్' అతిథులెవ‌రంటే..

2016లో కన్నడంలో వచ్చిన 'యు-టర్న్' సినిమాని.. తెలుగు, తమిళ భాషల్లో అదే పేరుతో అందాల తార‌ సమంత క‌థానాయిక‌గా పునఃనిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన విలేకరి పాత్రని ఈ రెండు భాషల్లో సమంత పోషించనున్నారు.