తండ్రికి మహేష్ బ్యూటిఫుల్ విషెష్.. నమ్రత ఎమోషనల్

  • IndiaGlitz, [Monday,May 31 2021]

నేడు సూపర్ స్టార్ కృష్ణ తన 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు తెరపై ఆయన సాధించిన ఘనతలు అనితరసాధ్యమైనవి. ప్రయోగాలకు, సాహసాలకు మారు పేరు ఆయన. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆయన విజయాల్ని గుర్తు చేసుకుంటోంది.

కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.. ' హ్యాపీ బర్త్ డే నాన్న.. ప్రతిసారి నాకు సరైన మార్గం చూపుతున్నందుకు థాంక్స్. ఎప్పటికి మీపై అమితమైన ప్రేమ ఉంటుంది' అని మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇదీ చదవండి: ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన

ఇదిలా ఉండగా మహేష్ సతీమణి నమ్రత కూడా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా నమ్రత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ' నేను ఎంతో ప్రత్యేకంగా భావించే వ్యక్తి.. ఈ రోజు మీ స్పెషల్ డే.. మీరు ఎంత ప్రత్యేకమైన వారో, ఎంత అభిమానం పొందదగిన వారో మరోసారి గుర్తు చేసుకోవాలి. విష్ యు హ్యాపీయెస్ట్ బర్త్ డే మామయ్య గారు' అని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేసింది.

కృష్ణ బర్త్ డే సంధర్భంగా సినీ ప్రముఖులు, నటులు , నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

More News

ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి

నెల్లూరు: జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి. గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే.

కరోనా బాధిత కుటుంబాల విషయంలో మోదీ కీలక నిర్ణయం..

కొవిడ్ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించాలని కేంద్రం నిర్ణయించింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా

ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన

ఎన్నో మంచి పనులు.. అన్ని ఆరోపణలు.. ఎన్నో ప్రశంసలు.. ఎన్నో చీత్కారాలు.. ఏనాడూ ప్రశంసకు పొంగిపోనులేదు.. విమర్శకు కుంగిపోనూ లేదు. చీత్కారాలకు మాత్రం

ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదానికి బ్రేక్..

ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా గతేడాది చేపమందు పంపిణీకి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం నీచానికి దిగజారింది: ఈటల సతీమణి జమున

ప్రభుత్వ యంత్రాంగంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున మండిపడ్డారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని,