తండ్రికి మహేష్ బ్యూటిఫుల్ విషెష్.. నమ్రత ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
నేడు సూపర్ స్టార్ కృష్ణ తన 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు తెరపై ఆయన సాధించిన ఘనతలు అనితరసాధ్యమైనవి. ప్రయోగాలకు, సాహసాలకు మారు పేరు ఆయన. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆయన విజయాల్ని గుర్తు చేసుకుంటోంది.
కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.. ' హ్యాపీ బర్త్ డే నాన్న.. ప్రతిసారి నాకు సరైన మార్గం చూపుతున్నందుకు థాంక్స్. ఎప్పటికి మీపై అమితమైన ప్రేమ ఉంటుంది' అని మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి: ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన
ఇదిలా ఉండగా మహేష్ సతీమణి నమ్రత కూడా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా నమ్రత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ' నేను ఎంతో ప్రత్యేకంగా భావించే వ్యక్తి.. ఈ రోజు మీ స్పెషల్ డే.. మీరు ఎంత ప్రత్యేకమైన వారో, ఎంత అభిమానం పొందదగిన వారో మరోసారి గుర్తు చేసుకోవాలి. విష్ యు హ్యాపీయెస్ట్ బర్త్ డే మామయ్య గారు' అని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేసింది.
కృష్ణ బర్త్ డే సంధర్భంగా సినీ ప్రముఖులు, నటులు , నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com