అన్న రమేశ్ బాబు దశ దిన కర్మకు హాజరైన మహేశ్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) ఈ నెల 8న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రమేశ్ బాబు దశ దిన కర్మకాండలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సోదరుడు , సినీ హీరో మహేశ్ బాబు హాజరయ్యారు. రమేశ్ బాబు నివాసంలో ఈ కర్మకాండలు నిర్వహించారు.
కాగా.. జనవరి 8 శనివారం సాయంత్రం రమేశ్ బాబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సొంత అన్నయ్య చనిపోయినా.. చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు మహేష్ బాబు. ఆ సమయంలో ఆయనకు కరోనా రావడంతో ఐసొలేషన్‌లో ఉంటున్నారు. దీంతో రమేశ్‌బాబు అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అన్నయ్యకు నివాళులు అర్పించారు.
'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేశ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని అపురూపంగా చూసుకునేవారు రమేష్ . కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చేపట్టారు. ఆ క్రమంలోనే రమేశ్ అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఎలాంటి ఇబ్బంది వున్నా అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు ..అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్‌కి వ్యక్తిగతంగా ఎప్పటికీ తీరని లోటు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com