మహేష్ తో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ సినిమా....

  • IndiaGlitz, [Monday,February 29 2016]

సూపర్ స్టార్ మహేష్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ తెలియజేశాడు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మురగదాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందట. ఈ సినిమా తర్వాత, కొంత గ్యాప్ తర్వాత మహేష్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందట. శక్తి తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న అశ్వనీదత్ ఇప్పుడు మళ్ళీ క్రేజీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాను 2017 సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నట్లు కూడా ఆయన అనుకుంటున్నాడట.