కిర్రాక్ ఫ్యాన్.. శ్రీకృష్ణుడిగా మహేష్ లుక్ అదుర్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది. పుట్టినరోజులతో పాటు పలు సందర్భాల్లో ఆయన ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఓ అభిమానికి మహేష్ బాబుని శ్రీకృష్ణుడి పాత్రలో చూడాలనిపించిందో ఏమో కానీ.. ఆ పాత్రలో మహేష్ ఎలా ఉంటాడో ఆయన ఫోటోను అలా ఎడిట్ చేసి ఎలివేట్ చేశాడు. మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ ఎలా ఉంటాడనేదే ఆ ఫోటో సారాంశంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నిజానికి ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడి పాత్రలో చూసినప్పుడు.. శ్రీకృష్ణుడు నిజంగా ఇలాగే ఉంటాడేమో అనిపించేది. ఆ తర్వాత ఇటీవల ఓ ఛానల్‌లో ప్రసారమైన మహాభారత్ ధారావాహికలో శ్రీకృష్ణుడి పాత్రధారి అయిన సౌరభ్ రాజ్ జైన్ చూసినప్పుడు కూడా దాదాపు నిజంగా శ్రీకృష్ణుడిని చూస్తున్న ఫీలింగే కలిగింది. తాజాగా మహేష్ ఫోటోను కిర్రాక్ ఫ్యాన్ ఒకరు శ్రీకృష్ణుడిగా ఎడిట్ చేసి ఎలివేట్ చేసిన తరువాత చూస్తే.. నిజంగా శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడేమోనన్న ఫీలింగ్ కలగక మానదు. మహేష్ మంచి అందగాడు కావడంతో శ్రీకృష్ణుడిలా అద్భుతంగా సెట్ అయ్యాడు. ఈ ఫోటో మహేష్ దృష్టికి వెళితే ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments