బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మహేష్!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం తుది అంకానికి చేరువవుతోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ షోకి శుభం కార్డు పడబోతోంది. ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలేకు డేటు కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ నిర్వహించిన మూడు సీజన్ల తరహాలోనే ఈ సారి కూడా ఫినాలేను గ్రాండ్‌గానే నిర్వహించాలని బిగ్‌బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ‘బిగ్‌బాస్-3’ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఏడాది ఫినాలే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తదితరుల పేర్లు వినిపించాయి. తాజాగా కొత్తగా మరోపేరు వినిపిస్తోంది. ఈ ఏడాది ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు మహేష్‌ను సంప్రదించారని కూడా టాక్ నడుస్తోంది. దీనికి మహేష్ సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఈసారి గ్రాండ్ ఫినాలేకు మహేష్ రావడం ఖాయమని సమాచారం.
బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్‌లు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వారిలో ఒకరు రేస్ టు ఫినాలే టికెట్‌ను గెలుచుకున్నారు. మరో నలుగురికి మాత్రమే టాప్ 5లోకి అవకాశం ఉంది. ఈ వారం ఒకరు.. వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో అభిజిత్, అఖిల్, హారిక, అవినాష్, మోనాల్ ఉన్నారు. అనధికార పోల్స్ నిర్వహిస్తున్న ఓటింగ్‌ను బట్టి చూస్తే ఈసారి మోనాల్ ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments