రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి శివాజీగా మహేష్?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయం పక్కనబెడితే సినిమా లైన్ ఏంటి? సినిమాలో నటిస్తున్న తారాగణం గురించి కానీ ఏ విషయంలోనూ ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. కాగా.. ఈ సినిమా ఇటీవలి కాలంలో జోరుగా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి కథను ఇప్పటికే సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా ఓ పిరియాడికల్ డ్రామాగానే తెరకెక్కనుందని సమాచారం.
ఛత్రపతి శివాజీని బేస్ చేసుకుని ఈ కథ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లాగే కల్పిత కథతో వస్తారో.. లేదంటే ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను సినిమాగా తీస్తారో తెలియాల్సి ఉంది. అసలు ఈ వార్తలో నిజమెంతో కూడా తెలియాల్సి ఉంది. ఈ ఛత్రపతి శివాజీ పాత్రలోనే మహేష్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి సెట్స్‌ను సైతం డిజైన్ చేయిస్తున్నారని కూడా పుకార్లు వస్తున్నాయి. దీనిపై రాజమౌళి, మహేష్‌లలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ నిజానిజాలు తెలిసే అవకాశం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout