సి.ఐ.డి ఆఫీసర్‌గా మహేష్?
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌ను అందుకున్నా.. తాజాగా విడుదలైన భరత్ అనే నేనుతో మళ్ళీ విజయాల బాట పట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టుకుని.. మహేష్ కెరీర్‌లోనే బెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. రంగస్థలం ఘనవిజయంతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అలాగే.. ఈ సినిమాలో మహేష్ సీఐడి ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాతే సుకుమార్ చిత్రం తెరపైకి వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com