మహేష్ - మురుగుదాస్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!
Thursday, November 24, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ఈ భారీ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంటే...డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్, చెన్నైలో ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
నెల రోజుల పాటు అహ్మాదాబాద్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ ఈనెల 27 నుంచి పాల్గొంటారు. ఈ నెల రోజుల్లో కొన్ని రోజులు పుణేలో కూడా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ & టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నారని సమాచారం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments