'ఒక్క అమ్మాయి తప్ప' ట్రైలర్ ను మెచ్చుకున్న మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన సందీప్ కిషన్ హీరో గా నటించిన చిత్రం ఒక్క అమ్మాయి తప్ప`. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10 న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా ట్రైలర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి . ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెచ్చుకోవటం గమనార్హం. టక్కరి దొంగ సినిమా రోజుల నుండి దర్శకులు రాజసింహ కు మహేష్ బాబు తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమం లో నే ఈ చిత్రం ట్రైలర్ ను మహేష్ బాబు కు చూపించటం జరిగింది. చిత్రం కథ గురించి, కథనం గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు, రాజసింహ చూపించిన ట్రైలర్ ను చూసి మెచ్చుకున్నారు. చిత్రం లో ని గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అని ప్రత్యేకం గా మహేష్ బాబు అభినందించారు.
దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ `నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను . ఇటీవలే మహేష్ బాబు గారిని కలిసి ట్రైలర్ ను చూపించాను. ఆయనకు ట్రైలర్ ఎంతగానో నచ్చింది", అని అన్నారు.
ఈ వారం లో నే ఒక్క అమ్మాయి తప్ప` సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం అని నిర్మాత బోగాది అంజిరెడ్డి అన్నారు. " జూన్ 10 న భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసాము. ఈ వారం లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత విడుదల తేదీని అధికారికం గా ప్రకటిస్తాము. సందీప్ కిషన్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మయిలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బం ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు . మా . ", అని ఆయన అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments