మజ్నుకి సూపర్‌స్టార్ అభినందన
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని మూడవ చిత్రానికి `మిస్టర్ మజ్ను` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో అఖిల్ క్యారెక్టర్ రివీల్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు.
విజువల్స్, ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుండే కాదు.. సినీ సెలబ్రిటీల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. `మిస్టర్ మజ్ను` టీజర్‌ను చూసి సూపర్‌స్టార్ మహేశ్ అఖిల్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించాడు. బాయ్స్ విల్ బి బాయ్స్.. యు విల్ వి బి యు.. లుకింగ్ కూల్. గుడ్ లక్ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు.
మహేశ్ వంటి సూపర్‌స్టార్ అభినందన టీమ్‌కు బూస్టప్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Boys will be boys...& you will be you?? Looking cool #MrMajnu ??
— Mahesh Babu (@urstrulyMahesh) September 19, 2018
Good luck @dirvenky_atluri & @AkhilAkkineni8 ??https://t.co/4RxGfww7NL
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments