కోపంగా ఉన్న మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మహేశ్ లుక్ ఒకటి లీకైంది. మాస్ లుక్‌లో మహేశ్ లుంగీ కట్టుకున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలా లుక్ విడుదల కావడంపై మహేష్ కోపంగా ఉన్నాడని గుసగుసలు వినపడుతున్నాయి. మహేష్ లుంగీ డ్యాన్స్ చేసే చిన్న పార్ట్‌ను ఎవరో లీక్ చేయడంపై నిర్మాత అసంతృప్తిగా ఉన్నాడట. మైండ్ బ్లాక్ అనే సాంగ్ చిత్రీకరణలో భాగంగా మహేష్ లుంగీ డ్యాన్స్ ఉంటుంది. ఇలా సస్పెన్స్‌గా ఆడియెన్స్‌ని థ్రిల్ చేద్దామనుకుంటే లీకేజీ రాయుళ్లు ఏకంగా షాకివ్వడంపై మహేశ్ అసంతృప్తిగా ఉన్నాడట.
మహేష్ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రమిది. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 11న విడుదలవుతుంది. రష్మిక మందన్నహీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ప్రకాశ్‌రాజ్, రాజేంద ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ మండేలో భాగంగా ఈరోజు సాయంత్రం ఈ సినిమాలోని హీ ఈజ్ సో క్యూట్ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలవుతుంది. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో నిర్వహించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com