షూటింగ్‌ను ఆపేసిన మహేశ్ అండ్ టీమ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారిపాట’. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రీసెంట్‌గానే యూనిట్ దుబాయ్ షెడ్యూల్‌ను షురూ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌ను యూనిట్ ఆపేసిందట. అందుకు కారణం.. కోవిడ్ సెకండ్ వేవ్ అని సమాచారం. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో దుబాయ్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్న యూనిట్.. తర్వాత గోవాలో షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. అయితే.. భారత్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో యూనిట్ ప్రస్తుతానికి షూటింగ్‌లో హోల్డ్‌లో పెట్టేసింది.
హీరో తండ్రిని మోసం చేసి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన విలన్‌ను ఇండియాకు రప్పించే హీరో కథే ఇది అని టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. ఇందులో మహేశ్ రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments