Mahesh Babu, Ram Charan: సీఎం రేవంత్ రెడ్డికి మహేష్, చరణ్ ప్రత్యేక అభినందనలు

  • IndiaGlitz, [Saturday,December 09 2023]

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారికి ఇవాళ శాఖలూ కేటాయించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నిఖిల్, నితిన్, సుధీర్ బాబు, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేంవత్ రెడ్డి గారికి అభినందనలు. మీరు రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు, అభివృద్ధి శిఖరాల వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నాను అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రంలో సానుకూల మార్పులు వస్తాయని.. అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను అంటూ చరణ్‌ ట్విటర్‌లో తెలిపారు.

మరోవైపు తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరనే దానిపై విపరీతమైన చర్చ జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయానైనా చర్చించాలంటే ఆ శాఖ మంత్రే కీలకం కానున్నారు. అందుకే కొత్త ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రిగా ఎవరు నియమితులు కానున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక ఇప్పటివరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

More News

ఏపీలో ఏం నడుస్తుంది.. ఉల్లిగడ్డ.. ఆలుగడ్డ .. నడుస్తుంది..

ఏపీలో ఏం నడుస్తుందంటే ఉల్లిగడ్డ రచ్చ నడుస్తుందంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉల్లిగడ్డ మీద ట్రోల్స్‌ కనపడుతున్నాయి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..

Revanth Reddy: ఒకేరోజు రెండు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండగ రోజు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు.

Pindam: కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది: 'పిండం' దర్శకుడు సాయికిరణ్ దైదా

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Keerthi Bhatt: వాళ్ళు దొరికితే రోడ్డు మీద నించోబెట్టి కొడతా! : బిగ్ బాస్ కీర్తి భట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చింది. హౌస్‌లో నలుగురు కటెంస్టులు మాత్రమే నిలిచారు. వీరిలో ఒకరి విజేతగా నిలవనున్నారు. ఇదంతా పక్కనపెడితే హౌస్‌లో కటెంస్టుల కొట్లాటల గురించి చెప్పనక్కర్లేదు.

అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు.. కేటీఆర్ గైర్హాజరు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు.