కుటుంబాలతో సహా కలుసుకున్న మహేష్, ఎన్టీఆర్
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
ఈ తరం స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్లు మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతిసారి కలుసుకుంటున్నారు. తాజాగా దర్శకుడు వంశీ పైడి పల్లి సతీమణి మాలిని పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలకు మహేష్, ఎన్టీఆర్ వారి కుటుంబాలతో కలిసి వచ్చేయడం విశేషం. రాంచరణ్ మడమకు గాయం కావడంతో రాంచరణ్ రాలేదు. మహేష్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ నటించిన 'మహర్షి' మే 9న విడుదల కానుంది.