మహేష్, ఎన్టీఆర్ కాంబినేషన్స్‌లో డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
'ఒక లైలా కోసం'(2014), 'ముకుంద'(2014), 'దువ్వాడ జగన్నాథమ్' (2017) .. ఇలా ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించినా.. చెప్పుకోదగ్గ విజయాన్నైతే తన ఖాతాలో వేసుకోలేదు ఉత్తరాది పూజా హెగ్డే. కాని ఈ మూడు చిత్రాల విషయంలో ఓ అరుదైన ఘనతను మాత్రం దక్కించుకుంది ఈ భామ.
అదేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా మూడు మతాలకు సంబంధించిన పండుగలను టార్గెట్ చేస్తూ విడుదల అయినవి కావడం విశేషం. తొలి రెండు చిత్రాలు దీపావళి, క్రిస్మస్ పండుగల సందర్భంగా విడుదలైతే.. ఇక 'దువ్వాడ జగన్నాథమ్' రంజాన్ సందర్భంగా విడుదలైంది. అంతేగాకుండా.. త్వరలో ఈ ముద్దుగుమ్మ చేయనున్న ఇద్దరు అగ్ర కథానాయకుల చిత్రాలు కూడా ఒకే పండగ టైమ్‌లో రాబోతున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. దీంతో పాటు.. వంశీ పైడిపల్లి రూపొందించబోతున్న మహేష్ బాబు 25వ చిత్రంలో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది ఈ డీ.జే. భామ. ఈ రెండు చిత్రాలు కూడా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయని సమాచారం.
అంటే ఇంతవరకు మూడు విభిన్న మతాల పండగల సమయంలో సందడి చేసిన పూజా.. తొలిసారి సంక్రాంతి బరిలో డబుల్ ధమాకా ఇవ్వబోతోందన్న మాట. అది కూడా మహేష్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పూజా ప్రత్యేక గీతం చేసిన 'రంగస్థలం' ఈ నెలలోనే విడుదల కానుండగా.. 'సాక్ష్యం' చిత్రం మే 18న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments