మహేష్, మురుగుదాస్ మూవీ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ నటించే సినిమా ఇదే అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత డైరెక్టర్ మురుగుదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్, మురుగుదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో భారీ బడ్జెట్ తో ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
అయితే ఈ క్రేజీ మూవీకి హారీష్ జైరాజ్ సంగీతాన్ని అందింస్తున్నారు. 2016 ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవితో స్టాలిన్ తర్వాత మురుగుదాస్ తెలుగులో చేస్తున్న స్ర్టైయిట్ ఫిలిమ్ ఇదే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే మురుగుదాస్..మహేష్ ని ఎలా చూపించనున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com