Mahesh Babu : డ్యాన్స్ షోలో మహేశ్ సందడి.. సితారను వెంటబెట్టుకుని, పెద్ద స్కెచ్చే వుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో రియాల్టీ షోల ట్రెండ్ బాగా నడుస్తోంది. తమ అభిమాన తారలు హోస్ట్‌లుగా వస్తుండటంతో షోలు జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు విషయానికి వస్తే.. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్, అన్‌స్టాప్‌బుల్ బాలయ్య వంటి షోలు బాగా హిట్టయ్యాయి. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్‌లుగా సత్తా చాటారు. ఈ కోవలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారని ఆ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అభిమానుల కల మాత్రం నెరవేరలేదు.
డ్యాన్స్ అంటే సెలబ్రేషనే:
మిగిలిన స్టార్ హీరోలు చేసిన షోలకు గెస్ట్‌గా వెళ్లడమే తప్పించి.. ప్రిన్స్ మాత్రం హోస్ట్ సీటులో కూర్చోలేదు. తాజాగా మహేశ్ తన కుమార్తె సితారతో కలిసి జీ తెలుగులో ప్రసారమవుతోన్న ‘‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ’’స్టేజ్‌పై సందడి చేశారు. సితారతో కలిసి ఈ షోకి రావడం ఆనందంగా వుందని.. తనకు తెలిసి డ్యాన్స్ అనేది ఒక సెలబ్రేషన్ అన్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుగోంది.
జీ తెలుగులో మహేశ్ డీల్ కుదుర్చుకున్నారా :
ఇదిలావుండగా మహేశ్ బాబు ఈ ఈవెంట్‌కి రావడం వెనుక పెద్ద స్కెచ్చే వుందంటున్నారు సినీ జనాలు. సూపర్‌స్టార్‌తో జీ తెలుగు భారీ డీల్ కుదుర్చుకుందట. ఏడాది పాటు ఆ ఛానెల్లో ప్రసారమయ్యే పలు షోలు, ఈవెంట్స్, సీరియల్స్‌లో కనిపించేందుకు గాను ఆయనకు భారీ మొత్తం పారితోషికంగా చెల్లించనున్నారట. అందుకే కుమార్తెతో కలిసి డ్యాన్స్ షోకి గెస్ట్‌గా హాజరయ్యారని అంటున్నారు.
మహేశ్ కోసం క్యూలో భారీ ప్రాజెక్ట్స్ :
మరోవైపు.. సర్కార్ వారి పాట హిట్‌తో మంచి జోష్ మీదున్న మహేశ్ బాబు వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టారు. త్రివిక్రమ్‌తో సినిమాను సెప్టెంబర్ 8న రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com