మ‌హేష్ కి అలా.. బ‌న్నీకి ఇలా..

  • IndiaGlitz, [Sunday,October 29 2017]

ఒకరిది ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన డేట్‌కి ఒక రోజు ముందు అనే సెంటిమెంట్‌.. మ‌రొక‌రిది ఆ సీజ‌న్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాన‌న్న సెంటిమెంట్‌తో పాటు ఆ సీజ‌న్‌లోనే ఎక్కువ హిట్‌లు ఇచ్చిన ఘ‌న‌త ఉండ‌డం అనే సెంటిమెంట్‌.

అలాంటి ఈ ఇద్ద‌రూ ఒకే రోజు బాక్సాఫీస్ వ‌ద్ద బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంది? అనే దానికి స‌మాధానం కావాలంటే.. ఏప్రిల్ 27 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాస్త వివరాల్లోకి వెళితే.. 2006లో ఏప్రిల్ 28న విడుద‌లైన పోకిరి చిత్రం మ‌హేష్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా.. పాత రికార్డుల‌న్నింటిని తిర‌గరాసి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం భ‌ర‌త్ అను నేను ని ఆ డేట్‌కి ఒక రోజు ముందు తీసుకురావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇక గంగోత్రితో స‌మ్మ‌ర్ సీజ‌న్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ‌న్నీకి.. ఈ సీజ‌న్‌లో ఆర్య‌, బ‌న్ని, ప‌రుగు, రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, స‌రైనోడు వంటి విజ‌యాలున్నాయి.

దానికి తోడు ఖుషి రిలీజ్ డేట్ అనే సెంటిమెంట్ తోడైంది. దాంతో త‌న కొత్త చిత్రం నా పేరు సూర్య‌ని ఏప్రిల్ 27కే ఫిక్స్ చేసుకున్నారు. అయితే.. చివ‌రికి ఈ తేదికి ఎవ‌రు క‌చ్చితంగా వ‌స్తారో అన్న‌ది ఆ రోజు వ‌ర‌కు ఆస‌క్తిక‌ర‌మే. ఇంకా ఆరు నెల‌ల టైముంది కాబ‌ట్టి.. ఈ లోపు ఏమైనా జ‌ర‌గొచ్చు. వెయిట్ అండ్ సీ!