వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సంవత్సరం ఒకే ఒక సినిమాతో సందడి చేసారు సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్పైడర్ చిత్రంతో సెప్టెంబర్‌లో మహేష్ అభిమానుల ముందుకొస్తే.. డిజె - దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో జూన్‌లో బన్నీ ఫ్యాన్స్‌ని పలకరించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. కాగా, ఈ ఇద్దరూ తమ తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ ఇరువురు అగ్ర కథానాయకులు వారం గ్యాప్‌లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. కొరటాల శివతో శ్రీమంతుడు తరువాత మహేష్ చేస్తున్న భరత్ నేను అను ఏప్రిల్ 20న విడుదలకి సిద్ధమవుతుండగా... వక్కంతం వంశీతో బన్నీ చేస్తున్న తొలి ప్రయత్నం నా పేరు సూర్య ఏప్రిల్ 27న రాబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.
మరి భరత్, సూర్య మధ్య జరుగుతున్న ఈ వేసవి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments