వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

ఈ సంవ‌త్స‌రం ఒకే ఒక సినిమాతో సంద‌డి చేసారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌. స్పైడ‌ర్ చిత్రంతో సెప్టెంబ‌ర్‌లో మ‌హేష్ అభిమానుల ముందుకొస్తే.. డిజె - దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో జూన్‌లో బ‌న్నీ ఫ్యాన్స్‌ని ప‌ల‌క‌రించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద మెప్పించ‌లేక‌పోయాయి. కాగా, ఈ ఇద్ద‌రూ త‌మ త‌మ కొత్త చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ ఇరువురు అగ్ర క‌థానాయ‌కులు వారం గ్యాప్‌లో వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో సంద‌డి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. కొర‌టాల శివ‌తో శ్రీ‌మంతుడు త‌రువాత మ‌హేష్ చేస్తున్న భ‌ర‌త్ నేను అను ఏప్రిల్ 20న విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతుండ‌గా... వ‌క్కంతం వంశీతో బ‌న్నీ చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం నా పేరు సూర్య ఏప్రిల్ 27న రాబోతున్న‌ట్లు ఎప్పుడో ప్ర‌క‌టించారు.

మ‌రి భ‌ర‌త్‌, సూర్య మ‌ధ్య జ‌రుగుతున్న ఈ వేస‌వి పోరులో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి?

More News

దలైలామా ను కలవొద్దు... చైనా ఘాటు హెచ్చరిక

గతం లో విదేశీ నాయకులు ఎవరైనా బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ను కలిస్తే చైనా నిరసన తెలుపుతూ వచ్చేది. కానీ ఇప్పుడు దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు తెలుస్తోంది.

త్రివిక్ర‌మ్ డబుల్ ధ‌మాకా?

ఏడాదికో సినిమా.. లేదంటే రెండు మూడేళ్ల‌కో సినిమా.. ఇలా ఉంటుంది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చే సినిమాల ప‌రిస్థితి. అలాంటి త్రివిక్ర‌మ్ వ‌చ్చే ఏడాది త‌న అభిమాల‌కు, ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజింగ్ షాక్ ఇవ్వ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త్రి

'రంగ‌స్థ‌లం' కొత్త డేట్‌..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'రంగ‌స్థ‌లం'. అక్కినేని స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది.

నవంబర్‌ 17న 'ఖాకి' భారీ రిలీజ్

"మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌" అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌’ ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూట

వైరల్ అవుతోన్న కోహ్లీ-అనుష్క వీడియో

‘కోహ్లీ-అనుష్క’ కలిసి నటించిన ఓ వీడియో యాడ్ ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.