35 లక్షలు మూల్యం చెల్లించిన మహేశ్ ఏఎంబీ సినిమాస్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భాగ్యనగరంలో ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం విదితమే. హైదరాబాద్‌లోనే చుట్టుపక్కల మెట్రో సిటీల్లో కూడా ఎక్కడా లేని అధునాతన సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. ఈ థియేటర్స్ లో సినిమా తిలకించాలంటే ఓ రేంజ్‌లోనే ఖర్చు పెట్టాల్సిందే. అయితే ఈ మల్టీప్లెక్స్ నియమ నిబంధనలను ఉల్లఘించిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ.. ఏఎంబీ సినిమాస్‌లో మాత్రం ఇంకా రేట్లు తగ్గించకుండా పాత రేట్లనే కొనసాగించింది. దీంతో పలువురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జీఎస్టీ అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సదరు మల్టిప్లెక్స్ సిబ్బంది వివరణ ఇచ్చుకుంది.
మూల్యం చెల్లించుకున్న మహేశ్ ఏఎంబీ..
కాగా.. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35,66,308.28/- ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించింది. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని మహేష్ బాబు నేతృత్వంలోని ఏఎంబీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నగదు చెల్లించిన సినీనటుడు మహేష్‌బాబుపై జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసల వర్షం కురిపించింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించిన అధికారులు థియేటర్స్, మల్టిప్లెక్స్‌లపై దాడి చేసినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద థియేటర్స్, మల్టిప్లెక్స్‌లు పాత రేట్లకే టికెట్లు అమ్ముతున్నట్లు పలువురు సినీ ప్రియులు వాపోతున్నారు. సదరు థియేటర్స్పై దాడి చేయాలని హైదరాబాదీలు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments