మహేష్.. ఐదేళ్ళ తరువాత
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో సందడి చేసిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. కథానాయకుడిగా తన 19 ఏళ్ళ కెరీర్‌లో.. 2000, 2002, 2003, 2004, 2006, 2014.. ఇలా ఆరు సార్లు మాత్రమే ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో ఆయన అభిమానుల ముందుకొచ్చారు.
గత మూడేళ్ళుగా ఏడాదికో సినిమాతో పలకరించిన మహేష్.. ఈ ఏడాది కూడా భరత్ అనే నేనుతో సరిపెట్టుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నారు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న తన తదుపరి చిత్రం ఈ జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళనుండగా.. వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.
ఇక సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న చిత్రం ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళి.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తమ్మీద.. 5 ఏళ్ళ తరువాత మహేష్ డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com