త్వరలో రాజమౌళితో సినిమా ఉంది: సూపర్‌స్టార్ మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో చిత్రబృందం గ్రాండ్ పూర్తిచేసుకుంది. ‘మహర్షి’ ప్రమోషన్స్‌లో ఇటు మహేశ్ అటు చిత్రబృందం బిజీబిజీగా ఉంది. శనివారం నాడు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో మీడియాకు కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మరోసారి డైరెక్టర్స్ సుకుమార్, పూరీ జగన్నాథ్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళి గురించి కూడా మహేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తదుపరి సినిమాలు ఎవరెవరితో చేస్తున్నారని మీడియా మిత్రులు మహేశ్ అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఆ ఇద్దరితోనూ సినిమాలుంటాయ్..!
"'మహర్షి' తరువాత కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అయితే సుకుమార్ గారు సీరియస్‌గా సాగే ఒక కథను తీసుకొచ్చారు. అందువల్లనే ఆ కథను పక్కన పెట్టేసి.. అనిల్ రావిపూడి వినిపించిన వినోదభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. మార్పు కోసం తను ఈ కథను ఒప్పుకున్నానని చెప్పినప్పుడు సుకుమార్ గారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సుకుమార్‌తో తప్పకుండా సినిమా ఉంటుంది. అంతేకాదు రాజమౌళిగారితోను కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన వస్తుంది" అని మహేశ్ సమాధానమిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ అభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్, సుకుమార్, రాజమౌళి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
కాగా.. కొందరు తన కోసం రెండు నెలలు, మూడు నెలలు కూడా వెయిట్ చేయలేకపోయారని కానీ వంశీ పైడిపల్లి మాత్రం రెండేళ్లు వేచి చూశాడని ‘మహర్షి’ ఈవెంట్‌లో మహేశ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పరోక్షంగా సుకుమార్‌ను ఉద్దేశించే చేశారని వార్తలు పుంకాలు పుంకాలుగా వచ్చేశాయి. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సూపర్‌స్టార్ స్పందిస్తూ అలాంటి విభేదాలేమీ లేవని.. తనకు ఒక డిఫరెంట్ కథ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ అని ఆయన చెప్పుకొచ్చారు. సో.. మహేశ్ తాజా రియాక్షన్‌తో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout