Mahesh Babu: ఇదే నా చివరి తెలుగు సినిమా.. అవి నిజమైన బీడీలు కావు: మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో అభిమానులను అలరిస్తోంది. మూవీలో మహేష్ డ్యాన్స్, నటన, స్వాగ్, స్లాంగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో టాక్ ఎలా ఉన్నా కానీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే 94కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టి రీజినల్ చిత్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మొదటి మూడు రోజుల్లో అయితే 164.7 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి.. 200కోట్ల రూపాయలు దిశగా వెళ్తోంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మహేష్ ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.
తాజాగా మహేష్, శ్రీలీల మీడియాకు సినిమా సక్సెస్ గురించి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గుంటూరుకారం సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే త్రివిక్రమ్, తాను ఓ విషయం గురించి గట్టిగా అనుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో కనీసం ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యామన్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మళ్లీ తాను రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. ఇదే తన చివరి తెలుగు సినిమా కొవొచ్చని చెప్పారు. అందుకే మన తెలుగు మాస్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు.
కాబట్టి ఈ మూవీ పాటలకు డాన్స్ ఇరగదీయాలని నిర్ణయించుకున్నానని.. అందుకు తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్, లాస్ట్ సాంగ్ ప్లాన్ చేశామని వివరించారు. అలాగే సెకండ్ హాఫ్‌లో గోడౌన్‌లో నెక్లీస్ గొలుసు సాంగ్ బిట్టు చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యామంటూ మహేస్ పేర్కొన్నారు. ఇక మూవీలో బీడీలు తాగడం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తాగినవి అసలైన బీడీలు కాదని.. తనకు అసలు స్మోకింగ్ అలవాటు లేదన్నారు. అలాగే స్మోకింగ్‌ని ఎంకరేజ్ చేయడం కూడా ఇష్టం లేదని స్పష్టంచేశారు.
సినిమా షూటింగ్ సమయంలో రియల్ బీడీని కాల్చిన వెంటనే విపరీతంగా తలనొప్పి వచ్చిందని తెలియజేశారు. దీంతో ఆ బీడీలు కాల్చడం తన వల్ల కావడం లేదని త్రివిక్రమ్‌కి చెప్పానన్నారు. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో సెట్స్‌కి సంబంధించిన వారు.. ఆయుర్వేదిక్ బీడీ తీసుకొచ్చి ఇచ్చారని తెలిపారు. అది లవంగం చెట్టు ఆకులతోటి తయారు చేశారని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆయుర్వేదిక్ బీడీలు కూడా ఉంటాయని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
కాగా మహేష్ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా డైరెకర్ట్, జక్కన్న రాజమౌళితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇందులో మహేష్ జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం ఖాయం. అందుకే ఇకపై కేవలం తెలుగు రీజినల్ సినిమాల్లో నటించడం కష్టం అవుతుందనే కారణంతోనే గుంటూరు కారం మూవీనే తన లాస్ట్ రీజినల్ మూవీ అని ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments