మహేష్ 27 టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం మే 31న ప్రారంభం కానుంది అని సినీ వర్గాల సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు పరుశురాం టైటిల్ ను ఖరారు చేశారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు "సర్కారీ వారి పాట".
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా టైటిల్ ని కూడా చేస్తారని టాక్. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుందట. అలాగే చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తాడని వార్తలు వినిపించాయి. కానీ చివరకు మహేష్ మాత్రం తమన్ ను తీసుకోవాలని సూచించాడట. దీంతో తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా వర్క్ చేయనున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సక్సెస్ కొట్టిన మహేష్ తదుపరి సినిమాను వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కథ నచ్చకపోవడంతో మహేష్ పరుశురాం వైపు మొగ్గు చూపాడు. గీత గోవిందం వంటి భారీ హిట్ తరువాత పరుశురాం దాదాపు ఏడాదిన్నర పైగా ఖాళీగా ఉన్నాడు. ఎట్టకేలకు మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు పరశురాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com