మహేశ్ 27లో నిర్మాణం సరే.. లాభాలెవరికి ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే వార్తలు వినపడుతన్నాయి. మహేశ్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తారు. అయితే ఈ సినిమాను కొరటాల శివ సెట్ చేశాడు. సెట్ చేయడానికి ముందు తాను ప్రాజెక్ట్‌ను సెట్ చేస్తే తనకు లాభాల్లో కొంత వాటా ఇవ్వాలంటూ మైత్రీ మూవీ మేకర్స్‌కు కండీషన్ పెట్టి వారిని ఈ ప్రాజెక్ట్‌లో లింక్ చేశాడని టాక్. మరి కొరటాల వాటాను ఎవరిస్తారనేది తర్వాత తెలుస్తుంది. కాగా.. ఈ సినిమా లాభాల్లో మహేశ్ 25 శాతం తీసుకోగా.. మిగిలిన దాంట్లో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పంచుకోవాల్సి ఉంది.
పరుశురామ్ తమ బ్యానర్‌కు ఎలాగూ సినిమా చేయాలి కాబట్టి.. సినిమా చేస్తున్నామే తప్ప.. ఇన్ని వాటాలుంటే ఏం మిగులుతుందని 14 రీల్స్ సంస్థ ఆలోచిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. మహేశ్ నాన్ థియేట్రికల్ హక్కులను పారితోషకంగా తీసుకునే మహేశ్.. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కొంత రెమ్యునరేషన్, మరికొంత లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com