మ‌హేష్ 25 రిలీజ్ డేట్‌..

  • IndiaGlitz, [Monday,July 02 2018]

ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో ఉత్త‌రాది భామ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. కామెడీ హీరో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వేస‌వి ఆరంభంలో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్రకారం.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని తెలిసింది.

పోకిరి, భ‌ర‌త్ అనే నేను కూడా ఏప్రిల్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్న నేప‌థ్యంలో.. ఈ చిత్రం కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. కాగా.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ పై క్లారిటీ వ‌స్తుంది.