స్టైలిష్ పోలీస్ గా మహేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ రా ఏజెంట్‌గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ పాత్ర గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమా సంగీత దర్శకుడు హారీష్ జైరాజ్ రివీల్ చేసేశాడట. మహేష్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని హారీష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా బడ్జెట్ వందకోట్లకు పైగా ఉంటుందని ఫిలింనగర్ సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments