మహేష్ 27వ సినిమా దర్శకుడు ఎవరంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివతో తన 24వ చిత్రాన్ని చేస్తున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. భరత్ అను నేను అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాని.. ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తరువాత ఎవడు, ఊపిరి చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు మహేష్. సి.అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది హీరోగా మహేష్ నటించే 25వ చిత్రం అవుతుంది.
ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 26వ చిత్రాన్ని చేసేందుకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అతడు, ఖలేజా తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చే మూడో చిత్రం ఇది. ఇక మహేష్ తన 27వ సినిమాని మాస్ డైరెక్టర్ బోయపాటితో చేయబోతున్నాడని..దీనిని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని సమాచారమ్.
దూకుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని మహేష్ కాంబినేషన్లో నిర్మించిన సదరు సంస్థ.. ఆ తరువాత 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలను నిర్మించింది. మళ్లీ బోయపాటి చిత్రంతో మరో హిట్‌ని మహేష్ కాంబినేషన్లో సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్. మరి వారి ముచ్చట నెరవేరుతుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com