మ‌హేశ్ 25వ చిత్రం అప్‌డేట్‌

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమా రూపంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్ర‌స్తుతం ఈ సినిమా స‌క్సెస్‌ను ఎంజ‌య్ చేస్తున్న మ‌హేష్‌.. అతి త్వ‌ర‌లో తన 25వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. కథానుసారం ఎక్కువ భాగం అమెరికాలో నేపథ్యంలో నడిచేది కావడంతో.. షూటింగ్‌ను అక్క‌డే ప్రారంభించ‌బోతున్నారు.  ఇప్పటికే ఒక‌వైపు సినిమాటోగ్రఫర్ కె.యు.మోహన్‌తో కలిసి దర్శకుడు వంశీ పైడిపల్లి లొకేషన్లు వెతికే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. మే నెలాఖరులో లేదా జూన్ నెల మొద‌టి వారంలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలిసింది. ఈ సినిమాలో ఉత్త‌రాది భామ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

More News

డ‌ల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు

డ‌ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి.

కాజ‌ల్‌కు రెండో సారి క‌లిసొస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు గ‌త ఏడాది మంచి విజ‌యాలే ద‌క్కాయి. ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా క‌లిసి న‌టించిన ఖైదీ నెం.150 ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

ప్ర‌భాస్‌తో మ‌రోసారి కొర‌టాల శివ‌

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సొంతం చేసుకుని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయారు కొరటాల శివ‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్స‌స్ విజ‌య్ ఆంటోని

ఈ వేసవిలో ఒకే రోజున త‌మ కొత్త చిత్రాల‌తో ఇద్దరు విజయ్‌లు పోటీకి దిగుతున్నారు. వారిలో విజయాల బాటలో ఉన్న హీరో ఒకరైతే.. ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనుకుంటున్న‌ హీరో ఇంకొకరు.

డబుల్ ధమాకా ఇవ్వనున్న స్టార్ హీరో, హీరోయిన్‌

ఈ సమ్మర్‌కి డబుల్ ధమాకా ఇవ్వడానికి ఓ స్టార్ హీరో, ఓ స్టార్ హీరోయిన్ సిద్ధపడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, చెన్నై బ్యూటీ సమంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'మహానటి'.