మహేష్ 25.. పూర్తిగా న్యూయార్క్ లోనే..

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకోబోయే ఈ చిత్రం కోసం...ఇప్పటికే న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో కొన్ని లొకేషన్లను కూడా ఎంపిక చేసారు దర్శకుడు. ఇందులో మహేష్ బాబు సరసన డీజే భామ పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది.

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలకి సంబంధించి బాణీలను కూడా దర్శకుడు వంశీకి వినిపించినట్టు సమాచారం. ప్ర‌ముఖ నిర్మాత‌లు అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని...మే ఆఖరి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించి 2019 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు తనకున్న కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని.. మే నెల కల్లా చిత్రీకరణలో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా వుంటే.. ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను' సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రం వేసవి సందర్భంగా ఏప్రిల్ 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

More News

దసరాను టార్గెట్ చేసుకున్న నాగశౌర్య

‘ఛలో' సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో వరుసగా సినిమాలను ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య.

రాజకీయాలను టచ్ చేస్తున్న 'రంగస్థలం'

ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే..ఇప్పుడైతే చాలా మాధ్యమాలు ఉన్నాయి.

'ఇష్టంగా.. సంతోషంగా..ఆనందంగా' అంటున్న ర‌చ‌యిత‌

కథా రచయితలు దర్శకులుగా మారడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. నిన్నటి తరం సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల నుంచి నేటి తరం డైరెక్టర్ వక్కంతం వంశీ వరకు చాలా మంది రచయితలుగా కెరీర్‌ను ఆరంభించి అనంత‌రం దర్శకులుగా రూపాంతరం చెందినవారే.

ముచ్చటగా మూడోసారి నానితో..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు.

'ఐతే 2.ఓ' మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకురా