రెండు టైగర్స్‌తో 'మహర్షి' ని మీ ముందుకు తీసుకొచ్చా!

  • IndiaGlitz, [Sunday,May 19 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సక్సెస్ మీట్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’.. శనివారం రోజున విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో గ్రాండ్ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దిల్ రాజు మాటల్లోనే...

రెండు విజయవాడ టైగర్స్ మధ్యలో ఉండి సినిమా పూర్తి చేసి మీ మధ్యకు తీసుకొచ్చాం. ఈ రెండూ విజయవాడ టైగర్స్ (అశ్వనీదత్, పీవీపిని చూపిస్తూ). వైజయంతి మూవీస్,పివిపి సినిమాస్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ముగ్గురం కలిసి మహేష్ బాబుగారి 25వ సినిమాను ప్రొడ్యూస్ చేయడం చాలా హ్యాపీ మొమెంట్. ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని సక్సెస్‌లు వచ్చినా కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయ్.. అలాంటిదే మహేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నేను కొంచెం హై గా మాట్లాడాను.

అలా ఎందుకు మాట్లాడానో మీకిప్పుడు అర్థమైంది కదా... ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుద్దో.. ఈ ‘మహర్షి’ సినిమాతో అది ప్రూవ్ అయ్యింది. చాలా సెంటర్లలో రికార్డ్ కలెక్షన్స్‌తో ముందుకెళ్తోంది. ఎన్నో రికార్డ్స్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఎన్నొస్తాయన్నది సెకండ్ వీక్‌లో చూద్దాం.

విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్ చేద్దామని అడిగినప్పుడు ఆయన.. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘దూకుడు’ అన్నీ గుర్తు చేసుకున్నారు. ఆ మూడు సినిమాల తర్వాత 'మహర్షి' ఈవెంట్ జరుగుతోంది. యూనిట్ అంతా కృష్ణా జిల్లాను కలవడానికి వచ్చింది. సినిమాతో పాటు సక్సెస్ మీట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు సూపర్ హిట్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

More News

100 డేస్.. 4 షోలతో ఫుల్.. వరల్డ్ రికార్డ్ : అశ్వనీదత్ 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది.

మెగా హీరో విష‌యంలో చేతులెత్తేసిన దేవి

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌కి, మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధ‌మో.. అలా కుదురుతుందేమో కానీ

‘పోకిరి’ని మించిపోతుందని.. షూటింగ్ ఫస్ట్ రోజే చెప్పా..!  

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది.

దర్శకేంద్రుడి మాటలకు దణ్ణం పెట్టిన మహేశ్, వంశీ.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ట్రెండ్ సెట్టర్‌గా మారిన 'మహర్షి'.. రైతులకు సన్మానం

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.