అనుకున్న టైంకే 'మ‌హ‌ర్షి'

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

సూప‌ర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. అల్ల‌రి న‌రేష్ హీరో స్నేహితుడి పాత్ర‌లో కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌ను ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25కు తీసుకెళ్లారు.

అయితే ఎన్నిక‌ల హ‌డావిడి, వంశీ పైడిప‌ల్లి సినిమాను ఆల‌స్యంగా చేస్తున్నాడ‌నే కార‌ణాల‌తో సినిమా జూన్‌కి వాయిదా ప‌డుతుందని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే రెండు పాట‌లు మిన‌హా మార్చి ప్ర‌థ‌మార్థంలో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ట‌. మ‌రో వైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. దీంతో సినిమాను ఏప్రిల్ 25నే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.