ట్రెండ్ సెట్టర్‌గా మారిన 'మహర్షి'.. రైతులకు సన్మానం

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'రైతుకు కావాల్సింది జాలి కాదు.. మ‌ర్యాద‌.. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌న అంద‌రిదీ’ అనే పాయింట్‌ అందర్నీ బాగా ఆకట్టుకుంటూ కుటుంబ సమేతంగా.. ఒక్క యూత్‌నే కాకుండా రైతన్నలను సైతం థియేటర్లకు క్యూ కట్టిస్తోంది.

'మహర్షి'  ట్రెండ్ సెట్టర్‌..

ఇదిలా ఉంటే.. ‘మహర్షి’లో మాదిరిగా 'వీకెండ్ వ్యవసాయం'.. 'రైతన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ' అనే ఈ రెండు మాటలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'మహర్షి' ఒక ట్రెండ్ సృష్టించాడన్న మాట. అయితే ఈ చిత్రం చాలా మంది మదిని కదిలించింది.. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్‌లు రైతన్నలను ఆదుకునేందుకు ముందడుగేస్తున్నాయి. తాజాగా.. మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ‘మహర్షి’ చిత్రాన్ని మెచ్చుకుంటూ.. రైతన్నలకు సన్మానం చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌లోని లలితమహల్ ధియేటర్ వేదిక కానుంది. ఈ సంద్భంగా మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘మహర్షి’ స్పూర్తితో మహర్షులకు సన్మానం!

పట్టణాల నుంచి మారుమూల పల్లెల్ని కదిలిస్తున్న చిత్రం ‘మహర్షి’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో నిర్మితమైన చిత్రం అందరిని ఆలోచింపచేస్తోంది. రైతు, కష్టాన్ని తన అవసరము ఎంతో తెలియజేసే చిత్రమిది. ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఈ నెల 20 (మే 2019 సోమవారం)న ఉదయం 9.30నిమిషాలకి ‘మాపల్లె మహర్షులు’ సమక్షంలో రైతులకి ఉచిత చిత్ర ప్రదర్శన.. రైతులకి సన్మాన కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో ‘మహర్షి’  చిత్రబృందం సందడి చేయనుంది. నిజామాబాద్‌లోని లలితమహల్ ధియేటర్‌కు అందరూ విచ్చేయగలరు. మీడియా మిత్రులకి చిత్ర ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాటు కలదు అని మా పల్లె ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.

More News

గజిబిజీ తీర్పు కాదు.. ఏపీలో హంగ్ రాదు: లగడపాటి 

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అప్పుడెప్పుడో తెలంగాణ ఎన్నికల్లో దర్శనమిచ్చి తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో మరోసారి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారు.

పవన్‌ గెలుస్తారో..? లేదో..? చెప్పేసిన లగడపాటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు చోట్లా పవన్ గెలుస్తారా..?

గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు! 

మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ నేతలు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌

టీవీ9 వివాదం: మరో షాకింగ్ ‘గరుడ పురాణం’ చెప్పిన శివాజీ!

టీవీ9 షేర్ల వివాదంలో ఈ చానెల్ మాజీ సీఈవో.. రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీ ఇద్దరూ పరారీలో ఉన్న విషయం విదితమే.. వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

'వెంకీ మామ‌' టీజ‌ర్ ఎప్పుడో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య నిజ జీవితంలోనే కాదు.. రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్లుగా న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర‌మే 'వెంకీ మామ‌'.