'మహర్షి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ డేట్‌

  • IndiaGlitz, [Monday,April 22 2019]

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'మహర్షి'. దిల్‌రాజు, అశ్వినీదత్‌, పివిపి నిర్మాత‌లు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో మే 1న నిర్వహించబోతున్నారట. ఈవారంలోనే వేదిక, ఫంక్షన్‌కు సంబంధించిన ఇతర వివరాలను ఫిక్స్‌ చేయబోతున్నారట. 'మహర్షి' మహేష్‌ 25వ సినిమా కావడంతో ఆయనతో పనిచేసిన దర్శకులు .. ఆయన గురించి చెప్పిన విషయాలను ఓ వీడియో రూపంలో కూడా ఈ ఫంక్షన్‌లో ప్రదర్శిస్తారట.