‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగేది ఇక్కడే...
Send us your feedback to audioarticles@vaarta.com
‘రైతుకు కావాల్సింది జాలి కాదు.. మర్యాద.. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ’ అనే పాయింట్ ఆధారంగా మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'.
మే-09న థియేటర్లలోకి వచ్చిన మహర్షి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. బహుశా ఈ రేంజ్‌లో విజయాన్ని నమోదు చేసుకుంటుందని చిత్రబృందం కూడా ఆశించి ఉండదేమో. అంతేకాదు ఈ చిత్రం చూసిన ఉపరాష్ట్రపతి, మెగాస్టార్ చిరంజీవి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మహేశ్ నటనను.. కథను మెచ్చుకుంటున్నారు. మరికొందరు టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా చెప్పినట్లే...
కాగా.. ఇప్పటికే సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా చేసుకున్న చిత్రబృందం విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించబోతోంది. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో మే-18న నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే సినిమా సక్సెస్‌మీట్‌కు వేదికను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
మే 18న విజయవాడలో 'మహర్షి' సక్సెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన, వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ చెప్పారు. కాగా తన సొంత జిల్లా అయిన విజయవాడలో.. పీవీపీ నిర్మించే ప్రతి మూవీకి సంబంధించిన మీట్‌లు ఎప్పట్నుంచో జరుపుతూ వస్తున్నారు. ఇదో ఆనవాయితీగా పీవీపీ పెట్టుకున్నారేమో!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com