‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగేది ఇక్కడే...

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

‘రైతుకు కావాల్సింది జాలి కాదు.. మ‌ర్యాద‌.. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌న అంద‌రిదీ’ అనే పాయింట్‌ ఆధారంగా మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మ‌హ‌ర్షి'.

మే-09న థియేటర్లలోకి వచ్చిన మహర్షి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. బహుశా ఈ రేంజ్‌లో విజయాన్ని నమోదు చేసుకుంటుందని చిత్రబృందం కూడా ఆశించి ఉండదేమో. అంతేకాదు ఈ చిత్రం చూసిన ఉపరాష్ట్రపతి, మెగాస్టార్ చిరంజీవి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మహేశ్ నటనను.. కథను మెచ్చుకుంటున్నారు. మరికొందరు టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా చెప్పినట్లే...

కాగా.. ఇప్పటికే సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా చేసుకున్న చిత్రబృందం విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించబోతోంది. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో మే-18న నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే సినిమా స‌క్సెస్‌మీట్‌కు వేదిక‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

మే 18న విజ‌య‌వాడ‌లో 'మ‌హ‌ర్షి' స‌క్సెస్‌మీట్‌ను ఘ‌నంగా నిర్వహించ‌డానికి ఏర్పాటు చేస్తున్నామ‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన, వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ చెప్పారు. కాగా తన సొంత జిల్లా అయిన విజయవాడలో.. పీవీపీ నిర్మించే ప్రతి మూవీకి సంబంధించిన మీట్‌లు ఎప్పట్నుంచో జరుపుతూ వస్తున్నారు. ఇదో ఆనవాయితీగా పీవీపీ పెట్టుకున్నారేమో!

More News

ఏపీలో ఐదు చోట్ల మళ్లీ పోలింగ్..

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పిన టీవీ9 రవిప్రకాష్!

టీవీ9 వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవోగా సుమారు 15 ఏళ్లు పాటు మీడియా ఇండస్ట్రీలో సేవలందించిన వ్యక్తి రవిప్రకాష్. టీవీ9 అంటే రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9 అనేంతగా ఇప్పటి వరకూ పరిస్థితులుండేవి.

గోదావరి వాసుల గుండెల్లో ఉన్నావ్ కాటన్ దొర!

అన్నం పెట్టే రైతన్నకు సాగునీరు అందక అల్లాడుతున్న కాలంలో ధాన్యం పండించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆనకట్టకు రూపకల్పన చేసిన మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన దొర.

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ 

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన '' 86 వసంతాల తెలుగు సినిమా ''

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్‌ ప్లస్ స్టోర్ నిర్మాణం

హైదరాబాద్‌లో అతిపెద్ద స్టోర్ ప్రారంభించడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారుతుండటం ఎంతో ప్రత్యేకమని వన్ ప్లస్ సంస్థ