మహేశ్ బాబు ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మూవీ టికెట్ ధరలు
- IndiaGlitz, [Tuesday,May 07 2019]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజాహెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న మహర్షి అభిమానుల ముందుకు రాబోతున్నాడు. అయితే 'మహర్షి' రాకతో హైదరాబాద్ నగరంలో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సో.. ఇక నుంచి భాగ్యనగరంలో సినిమా చూడాలంటే టికెట్ల ధర మోత మోగనతుందన్న మాట. నగరంలో అన్ని థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుతున్నట్లు యాజమాన్యాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ‘మహర్షి’ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతున్నట్లు థియేటర్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
రేట్లు ఇలా ఉంటాయ్..!
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ. 110కి పెంపు
మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచిన యాజమాన్యాలు
ప్రసాద్ ఐమ్యాక్స్ లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200 చేసినట్లు యాజమాన్యం తెలిపింది. కాగా ప్రభుత్వ అనుమతితోనే టికెట్ ధరలు పెంచినట్లు థియేటర్ యాజమాన్యాలు వెల్లడించాయి. పెంచిన టికెట్ ధరలు రెండు వారాలపాటు అమలు చేయనున్నట్లు యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
సో మహేశ్ బాబు దెబ్బకు టికెట్లు మోత పోయిందన్న మాట. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’ ఎల్లుండి థియేటర్లలోకి రానుంది. మహర్షి హవా ఉన్నంత వరకూ టికెట్ల ధరలు గట్టిగానే ఉంటాయన్న మాట. ఒక విధంగా చూసుకుంటే ఇది సామాన్యుడికి గట్టి దెబ్బేనని చెప్పుకోవచ్చు.. సింగిల్ 200 అంటే ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఇక కష్టమే మరి.