ఫ్యాన్సీ రేటుకు 'మహర్షి' డిజటల్ హక్కులు...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ 25వ సినిమా `మహర్షి`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 9న సినిమా విడుదలవుతుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే `చోటి చోటి బాతే...` అనే ఫ్రెండ్ షిప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మంచి స్పందన కూడా వస్తుంది. ఈ సినిమాను డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుందని సమాచారం. వివరాల ప్రకారం `మహర్షి` కోసం 11 కోట్ల రూపాయలను అమెజాన్ చెల్లించిందట. మహేష్ సినిమాల్లో ఇంత భారీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com