కంగన చుట్టూ ఉచ్చు బిగిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ చుట్టూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని కూల్చివేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆమెను డ్రగ్స్ విషయంలో విచారించేందుకు సిద్ధమైంది. ఈ విచారణ బాధ్యతను ముంబై పోలీసులకు అప్పగించడంతో ఈ దిశగా ప్రస్తుతం ముంబై పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా ముంబై పోలీసులకు ఉత్తర్వులు అందినట్టు సమాచారం.
గతంలో కంగన మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూను ఆధారంగా చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ ఇంటర్వ్యూ అధ్యయన్ సుమన్ మాట్లాడుతూ. కంగన డ్రగ్స్ తీసుకుంటుందని.. ఆమెకు అలవాటు ఉందని.. తనకు కూడా డ్రగ్స్ అలవాటు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల ఆధారంగా ముంబై పోలీసులు కంగనను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే అధ్యయన్ సుమన్ చేసిన ఆరోపణలపై మీ సమాధానం ఏంటంటూ ముంబై పోలీసులు కంగనకు నోటీసులు సైతం ఇచ్చారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని కంగనకు సూచించారు. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కక్షపూరిత చర్యలకు పాల్గొనడమేంటని కంగన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంక కంగన, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్.. మరింకెన్ని పరిణామాలకు దారితీయనుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout