‘మహా’నాట పదవుల పంపకాలు పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రేపు కొలువు తీరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు కూటమి పార్టీలైన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌కు ముఖ్య నేతలు భేటీ అయ్యి పదవుల గురించి చర్చించి ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పదవుల పంపకంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే చర్చలు కొనసాగించారు.
పంపకాలు పూర్తయ్యాయ్!
మూడు పార్టీల మధ్య.. (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) 16-15-13 ఫార్మూలాకు మూడు పార్టీలు దాదాపు ఓకే చెప్పాయని సమాచారం. అయితే.. స్పీకర్ పదవిపై పట్టుబడరాదని కాంగ్రెస్ నిర్ణయానికొచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. రేపు అనగా గురువారం నాడు మహా సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 6:40 గంటలకు థాక్రే ప్రమాణం చేయనున్నారు. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో పాటు మరో 15 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందరూ వస్తున్నారోచ్..!
కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని విపక్ష పార్టీల నేతలను ఆహ్వానించాలని శివసేన యోచిస్తోంది. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రమాణ స్వీకారానికి స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని ఉద్ధవ్ నిర్ణయించారని తెలుస్తోంది. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు సైతం ఆహ్వానాలు అందుతాయని సమాచారం.
నిన్న రాజీనామా...రేపు ప్రమాణ స్వీకారం...!
శాసనసభాపక్ష నేత బాధ్యతలు మళ్లీ అజిత్ పవార్‌కు అప్పగించే యోచనలో ఎన్సీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి పదవి ఎవరికిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు చెరో రెండున్నరేళ్ల పాటు డిప్యూటీ సీఎం పదవిని పంచుతారని తొలుత వార్తలు వినిపించగా తాజాగా అజిత్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. అజిత్ పవార్ మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవి చేపడుతారని ఊహాగానాలు నేట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంటే నిన్న రాజీనామా చేసిన అజిత్ .. రేపు అదే బాధ్యతలను స్వీకరించబోతున్నాడన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout