'బొమ్మల రామారం' చిత్రాన్ని అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన నటీ నటులతో, నిశాంత్ దర్శకత్వంలో, మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకం పై పుదారి అరుణ నిర్మిస్తున్న చిత్రం “బొమ్మల రామారం”. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో శ్రీమతి పి. సుశీల గారి చేతులమీదుగా మధుర ఆడియో ద్వారా జరిగింది. ఇటీవలే చిత్ర నిర్మాతలు ఈ సినిమా మొదటి కాపీ ని మహారాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన శ్రీ సి. హెచ్ విద్యాసాగర్ రావు గారు చూసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఎటువంటి అశ్లీలతకి తావులేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అభినందనీయం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది” అని అన్నారు. అంతే కాకుండా చాలా ఏళ్ల తరువాత ప్రముఖ గాయని పి. సుశీల గారి స్వరం ఈ సినిమా ద్వారా వినడం ఆనందాన్ని కలిగించిందన్నారు. మరియు “పాటలన్నీ వినసోంపుగా ఉన్నాయి, ఒక మంచి కథని నమ్మి సినిమా తీసినందుకు చిత్రనిర్మాతల్ని అభినందిస్తూ, చిత్ర బృందానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను `అన్నారు.
చిత్ర నిర్మాత పుదారి అరుణ మాట్లాడుతూ “ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
సూరి, తిరువీర్, రూపా రెడ్డి, ప్రియదర్శి, విమల్ కృష్ణ, కేశవ్ దీపక్, మోహన్ భగత్, సంకీర్తన, జ్యోతివర్మ, అభయ్, గుణకర్, శివ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: బి. వి. అమర్ నాథ్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, (బ్యాక్ గ్రౌండ్), శ్రవణ్ మైకేల్, ఎడిటర్: శివ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ. రచనా – దర్శకత్వం: నిశాంత్ పుదారి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments