మహారాష్ట్ర భక్తుడి ఎఫెక్ట్ : తిరుమలలో దర్శనాలు నిలిపివేత

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునిపై కూడా పడింది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ తాజాగా.. స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. ఇతర దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకెళితే.. గురువారం మధ్యాహ్నం టీటీడీ ఉన్నతాధికారులు, ఈవో, చైర్మన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా విషయంలో ఇప్పటి వరకూ తీసుకున్న జాగ్రత్తలే కాకుండా ఇంకా ఏమేం తీసుకోవచ్చు..? ఇతర రాష్ట్రాల నుంచి.. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి భక్తులను ఎలా అరికట్టాలి..? అనే విషయంపై నిశితంగా చర్చించారు. ఘాటు రోడ్లతో పాటు.. శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

అన్నీ మూసివేత..

నేటి నుంచి తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయడం.. రేపట్నుంచి రెండు ఘాట్లు కూడా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాదు.. ఇవాళ్టి సాయంత్రం నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే.. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తిరుమలకు రాకపోకలకు పూర్తిగా టీటీడీ నిలిపివేసింది. ఇప్పటి వరకూ వచ్చిన భక్తులను మాత్రమే దర్శనం చేయించి పంపేయనున్నారు. అయితే ఇకపై తిరుమలకు వచ్చే భక్తులను అనుమతి లేదు. మరోవైపు అలిపిరి ఘాట్లతో పాటు టోల్ గేట్‌ను సైతం మూసివేయడం జరిగింది.

మహారాష్ట్ర భక్తుడి ఎఫెక్ట్!

వాస్తవానికి ఇవాళ మహారాష్ట్ర నుంచి తీర్థ యాత్రల్లో భాగంగా దామోదరం అనే భక్తుడు తిరమల వెంకన్న దర్శనానికి వచ్చాడు. ఇదివరకే ఆయన వారణాసి వెళ్ళొచ్చాడు. అయితే.. తిరుమలకు రాగానే తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉండటంతో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న తోటి భక్తులు సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం.. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆయన్ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న సిబ్బంది ఆయన్ను ప్రత్యేక విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కరోనా టెస్ట్‌లు కూడా చేశారని తెలుస్తోంది.

దేశంలో ఇపపటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రవారికే ఎక్కువగా సోకింది. దీంతో ఆయనకు కరోనా ఉండొచ్చనే అనుమానంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆయన క్యూ లైన్‌లో వెళ్లడం.. భక్తులతో కలిసి నడవడంతో తోటి భక్తులు, తిరుపతి వాసులు భయంతో జంకిపోతున్నారు. ఆయనకు టెస్ట్‌లు చేస్తే కరోనా పాజిటివ్ ఉందా..? లేకుంటే నెగిటివా అనేది తేలనుంది. పాజిటివ్ ఉంటే పరిస్థితి ఏంటో మరి. ఇలాంటి కేసులు రానురాను ఇంకా ఎక్కువ అవ్వొచ్చనే ముందు జాగ్రత్తగా టీటీడీ పై విధంగా నిర్ణయాలు తీసుకుంది.

More News

ఆశలు ఆవిరి.. నిర్భయ నిందితులకు రేపే ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీంకోర్టు, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో

కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. ఇలా చేయండి..: చిరంజీవి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను

సంపర్క్ క్రాంతి-ఎస్9 : కరోనా భయంతో వణికిపోతున్న కరీంనగర్!

కరోనా పేరెత్తితో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌లు పెరిగిపోతుండటం.. మరోవైపు అనుమానిత కేసులు సైతం ఎక్కువవుతుండటంతో ప్రభుత్వాలు తగు

ఏపీకి వచ్చిన ఆ 185 మందికి కరోనా లేదు!

కరోనా వైరస్‌ మూలంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కేంద్రం సహాయంతో స్వదేశానికి రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

'ఆర్ఆర్ఆర్' నుండి వైదొలుగుతున్న అలియా భట్ ?

బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.