షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహనుభావుడు' విజయదశమి కి చిత్రం విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ హీరోగా, మెహరిన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహనుభావుడు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఇటలీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మరియు పోలాచ్చి, రామొజీఫిల్మ్సిటి, హైదరాబాద్ లో ని అందమైన లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ వారం నుండి ఆడియో సింగిల్స్ విడుదల చేసి త్వరలోనే ధియోట్రికల్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమి కి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... శర్వానంద్ హీరోగా మూడవ చిత్రం, మారుతి దర్శకుడిగా రెండవ చిత్రం గా మా బ్యానర్ లో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం మహనుభావుడు. మారుతి చెప్పిన కేరక్టరైజేషన్ దాని నుండి వచ్చిన కామెడి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాం. ప్రమోషన్ ఈ వారం నుండి పక్కాగా ప్లాన్ చేశాము. ఈ చిత్ర షూటింగ్ ని విదేశాల్లో, ఇండియాలో ని పలు ప్రదేశాల్లో చిత్రాన్ని షూట్ చేశాము.ఇటీవలే విడుడల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావటమే కాకుండా సుమారు కోటి వ్యూస్ డిజిటల్ మీడియలో పొందింది. అందుకే ఈ టీజర్ ని 700 కి పైగా ధియేటర్స్ నిన్నటినుండి ప్రదర్సిస్తున్నాం.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమికి విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. భలేభలేమగాడివోయ్ చిత్రం తరువాత నాకు బాగా నచ్చిన కేరక్టరైజేషన్ తో చేస్తున్న చిత్రం మహనుభావుడు. అన్ని పక్కాగా ఈ కథకి తగ్గట్టుగా కుదిరాయి. శర్వానంద్ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుందని నమ్మకం వుంది. శర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. థమన్ సూపర్ ఆడియో అందించాడు. త్వరలో రెండు మ్యూజిక్ సింగిల్స్ ని తదుపరి ఆడీయో ని విడుదల చేస్తాము. ఈ చిత్రం మ్యూజికల్ లవ్ స్టోరి గా వుంటుంది. దసరా కి విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. అని అన్నారు.
నటీనటులు.. శర్వానంద్, మెహరిన్, వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్, పిజ్జాబాయ్, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకి, శంకర్రావు, రామాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బులు చౌదరి, సుభాష్, ఆర్.కె తదితరులు..
సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్- నిజార్ షఫి, ఆర్ట్-రవిందర్, ఫైట్స్-వెంకట్, ఎడిటింగ్- కొటగిరి వెంకటేశ్వరావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- ఎన్.సందీప్, కొ-ప్రోడ్యూసర్- ఎస్.కె.ఎన్, ప్రోడ్యూసర్స్- వంశి-ప్రమోద్, స్టోరి, మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం- మారుతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com