మహానటుల పాత్రల కోసం 'మహానటి' టెక్నాలజీ
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించనున్న చిత్రం మహానటి`. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారి కాగా.. యువ దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇదిలా వుంటే...సావిత్రి కథతో సినిమా అంటే ఆమెతో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్, ఎఎన్నార్ పాత్రలు కూడా ముఖ్యమే. అందుకోసం చిత్ర బృందం ఈ పాత్రల కోసం.. వారి మనుమలైన జూ.ఎన్టీఆర్, నాగ చైతన్యని సంప్రదించగా...వారు ఈ పాత్రల్లో నటించడానికి సుముఖంగా లేరని తెలిసింది.
ఇక వీరితో పాటు చాలా మంది నటులను సంప్రదించినా.. వారు కూడా ముందుకు రాకపోవడంతో ఇప్పుడు టెక్నాలజీని నమ్ముకోనుంది చిత్ర యూనిట్. డిజిటల్ టెక్నాలజీని అనుసరించి ఎన్టీఆర్, ఎఎన్నార్ నటించిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను ఈ టెక్నాలజీ ద్వారా స్క్రీన్ పై చూపించనున్నారు. (అంటే గతంలో కలిసుందాం..రా`, యమదొంగ` సినిమాల్లో చూపించినట్టు). అయితే ఈ టెక్నాలజీ ద్వారా ఈ పాత్రలను చూపించడం వలన వీరి పాత్రల నిడివిని తగ్గించనున్నారు దర్శకుడు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments