'మహానటి'.. ఆ జాబితాలో చేరుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మే 9.. తెలుగు సినిమాకు కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఈ తేదీన విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించాయి. అలా సంచలనాలకు తెర తీసిన సినిమాల గురించి ప్రస్తావిస్తే.. 1990లో ఇదే తేదీకి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అనంతరం 1991లో ఇదే తేదీకి ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా విడుదలైంది. చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్‌లుగా విజయబాపినీడు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది.
కట్ చేస్తే.. 1997లో వెంకటేష్, అంజలా ఝవేరి నాయకానాయికలుగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ కూడా ఇదే తేదీకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జయంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలవడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్‌గా తన జోరును చూపించింది. అలాగే.. ఇదే తేదీకి 2002లో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ ముఖ్య పాత్రల్లో దశరధ్ దర్శకత్వం వహించిన ‘సంతోషం’ సినిమా విడుదలైంది. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తేదీని అంటే మే 9ని టార్గెట్ చేస్తూ అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ రాబోతోంది. మరి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మే 9న ‘మహానటి’ ఎటువంటి మ్యాజిక్ చేయబోతోందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com