బాలీవుడ్‌కి 'మహానటి'
Send us your feedback to audioarticles@vaarta.com
కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `మహానటి`. సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ టాక్‌తో రన్ అవుతోంది. సినిమా గురించి అందరూ పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఈ సినిమా గురించి విన్న బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా సినిమాను చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారని సమచారం. మరి మహానటిని హిందీలోకి అనువాదం చేస్తారో లేక రీమేక్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments